హైదరాబాద్ మరియు విజయవాడ బుక్ ఫేర్ లలో తెలుగు భాషాభిమానుల నెందరినో ఆకర్శించిన అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్
విశేషాలు...
- ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా, ఇంగ్లీష్ ఫొనేటిక్ గతుకుల రోడ్డెందుకు అంటుంది అనుపమ.
- అనుపమ కంప్యూటర్లో తెలుగు టైపింగ్ ను సులువుగా నేర్పే తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్ సాప్ట్ వేర్.
- అనుపమ, ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ లో తెలుగు టైపింగ్ ను నేర్పుతుంది. ఇది భారతప్రభుత్వము కంప్యూటర్లలో భారతీయభాషల టైపింగ్ కు ఆమోదించిన కీబోర్డు లేఅవుట్ (ఇండియన్ స్క్రిప్ట్ కు సంక్షిప్త రూపము.)
- 24 గంటలలోనే మీరు నైపుణ్యతగల తెలుగు టైపిస్ట్ కాగలరు. మొదటి పది గంటలలోనే తెలుగు కీబోర్డుపై మీకు పూర్తి పట్టు వస్తుంది.
- కంప్యూటర్లో తెలుగును రాయడానికి ఆంగ్ల అక్షరాలపై, పద్మ, బరహ, లేఖిని లాంటి ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ పై, ఆధారపడాల్సిన అవసరం లేదిక. కంప్యూటర్లో, తెలుగును తెలుగులోనే రాయగలుగుతారు.
- అనుపమతో తెలుగు టైపింగ్ నేర్చు కోవడంద్వార, మైక్రోసాప్ట్ విండోస్ ఎక్స్ పి, విస్టా, ఆఫీస్ లలో తెలుగుతో సహా బ్రాహ్మీ లిపి ఆధారిత లిపులను కలిగిన అన్ని భారతీయ భాషలలో మరే ఇతర సాప్ట్ వేర్ అవసరం లేకుండానే టైపు చేయగలుగుతారు. మైక్రోసాప్ట్ విండోస్ ఎక్స్ పి, విస్టా, ఆఫీస్ లు ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ ను సపోర్టు చేస్తున్నవి.
- అనుపమ తెలుగు టైపింగ్ ను అందమైన వాతావరణంలో నేర్పుతుంది. టైపింగ్ నేర్పేటప్పుడు అనుపమ కీబోర్డుపై వేళ్లను ఉంచాల్సిన సరైన పద్ధతిని కూడా నేర్పుతుంది.
- సామేతలు, నుడికారం, జాతియాలు, అందమైన భాషకు అవే ఆయువుపట్టు. వాటన్నింటిపై, తెలుగు భాషపై మీకు మంచి పట్టు వచ్చేలా చేస్తుంది అనుపమ, ఏర్చి కూర్చిన టైపింగ్ సాదన పాఠాల ద్వార.
- అనుపమ మీ టైపింగ్ ప్రోగ్రెస్ ను అనుక్షణం మానిటర్ చేసి గ్రాఫ్స్ ద్వారా చూపిస్తుంది. మీ, మీ వయస్సుకు తగిన టైపింగ్ లక్ష్యాన్ని మరియు వేగాన్ని నిర్దేశిస్తూ, అందుకు తగిన పాఠాలను మీ చేత సాదన చేయిస్తుంది.
- అనుపమతో తెలుగు టైపింగును ఆడుతూ, పాడుతూ నేర్చుకోవచ్చును. కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడే.... అంటూ కూని రాగాలు తీస్తూ, మీరు నిపుణతగల తెలుగు టైపిస్ట్ గా మారిపోతారు, అనుపమ సన్నిధిలో అతి శ్రావ్యమయిన నేపథ్య సంగీతాన్ని వింటూ. అనుపమ మీకు తెలుగు పదకవితా పితామహూడైన అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యమైన నేపథ్య సంగీతంగా వినిపిస్తుంది.
- అనుపమతో నేర్చుకొనేటప్పుడు, తెలుగు టైపింగ్ ఒక చిన్నపిల్లల ఆట అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఐదేళ్ల పాపాయి నుండి ఆరుపదులు దాటిన పెద్దవారు కూడా తెలుగు టైపింగ్ ను అతి సులభంగా నేర్చుకోవచ్చును.
- అమృతం, తేనెతుట్ట, వెన్నకుండ,ట్యాంక్ బండ్, గోదావరి, పండుగలు, ఇలా ఎన్నెన్నో ఆటలాడుతూ, పాటలు పాడుతూ, హాయిగా, హాయి హాయిగా, తెలుగు టైపింగ్ ను నేర్చుకోవచ్చును అనుపమతో, అతి సులువుగా.